సాఫ్ట్‌బాల్ పోటీల్లో సత్యశోధక్ విద్యార్థినుల ప్రతిభ

10-10-2026 | 05:51pm

సిరికొండ, అక్టోబర్ 10,(విజయక్రాంతి ): సిరికొండ మండలంలోని(Sirikonda Mandal) సత్యశోధక్ ఉన్నత పాఠశాలకు(Satyashodhak High School) చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి సాప్ట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ రావుట్ల నర్సయ్య తెలిపారు.ఈనెల 4న జక్రాన్‌పల్లి మండలం తొర్లికొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(Zilla Parishad High School) (ZPHS) ప్రాంగణంలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు చెప్పారు. అక్టోబర్ 11, 12 తేదీలలో నిర్వహించనున్న 11వ తెలంగాణ రాష్ట్రస్థాయి అండర్-13 మినీ సబ్-జూనియర్ అంతర్‌జిల్లా సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్ 2026–27 బాలికల విభాగం పోటీలకు సత్యశోధక్ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు ఏ. యుగేశ్వరి, ఎం. మేఘన ఎంపికయ్యారరానీ తెలిపారు. 

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్. నర్సయ్య శనివారం విద్యార్థినులను అభినందించి, రాష్ట్రస్థాయి పోటీలలో ఆత్మవిశ్వాసంతో పాల్గొని, క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఉత్తమ ప్రతిభ కనబరచాలని సూచించారు 

విద్యార్థినులు తమ ప్రతిభతో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలనిp ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది విద్యార్థినులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు అనికేత్, అనిల్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

01. ఎంపికైన విద్యార్థులను అభినందిస్తున్న ఉపాధ్యాయ బృందం

మరిన్ని వార్తలు