బతుకమ్మల కొరకు ఏర్పాట్లు విషయంలో నిర్లక్ష్యం

10-10-2026 | 05:59pm
  1. బతుకమ్మ వాగు వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలి
  2. వెంకట రత్నాపూర్ గ్రామ యువకులు

తూప్రాన్, అక్టోబర్ 10, (విజయక్రాంతి): మెదక్ జిల్లా(Medak District) తూప్రాన్ మండలం వెంకటరత్నపూర్ గ్రామ పరిధిలోని హల్ది వాగులో(Haldi Stream) గత కొన్ని సంవత్సరాలుగా దసరా సందర్భంగా బొడ్డెమ్మల పండుగ నుండి పెద్ద బతుకమ్మల పండుగ(Bathukamma Festival) వరకు బతుకమ్మలను వాగులో మహిళలు వేయడం జరుగుతుంది, కానీ అన్ని గ్రామాలు అభివృద్ధి(Village Development) పథంలో ముందుకు వెళుతున్న ఈ తరుణంలో బతుకమ్మలు వేసే స్థలంలో మహిళల కొరకు గ్రామ పంచాయతీ(Gram Panchayat) అధికారిగాని ప్రతినిధిగాని సరైన మరమ్మత్తులు గాని లైట్లు గాని పిచ్చిముక్కల తొలగింపుగాని ఏర్పాటు చేయలేదని గ్రామస్తులు ఆరోపించారు.

ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో బతుకమ్మ ఘాట్లు ఏర్పాటుచేసి లైట్లు, పిచ్చి మొక్కల తొలగింపు, కావలసిన మరమ్మత్తులను చేయడం జరుగుతుంది కానీ గ్రామ పరిస్థితి దీనికి భిన్నంగా తయారయింది. ఏర్పాట్ల విషయంలో గ్రామ అధికారి, గ్రామ పంచాయతీ ప్రతినిధులు విఫలమయ్యారని గ్రామస్తులు పేర్కొన్నారు. తక్షణమే బతుకమ్మ వేసే స్థలంలో అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. ఇందులో గ్రామ యువకులు, తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు