కలవేన దేవలతకు వైద్య సాయం

10-10-2026 | 05:56pm

మంత్రి శ్రీధర్ బాబు చొరవతో సీఎంఆర్ఎఫ్ ద్వారా ఎల్‌ఓసీ మంజూరు

అనారోగ్యంతో బాధపడుతున్న బాధితురాలికి అండగా మంత్రి

ముత్తారం, అక్టోబర్ 10 (విజయక్రాంతి): అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో(NIMS Hospital) చికిత్స పొందుతున్న ముత్తారం మండలం కేశనపల్లి గ్రామానికి చెందిన కలవేన దేవలతకు(Devalatha) రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Duddilla Sridhar Babu) అండగా నిలిచారు. ఆమె వైద్య చికిత్స(Medical treatment) ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి(Chief Minister Relief Fund) (సీఎంఆర్ఎఫ్) ద్వారా రూ.2.50 లక్షల విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌ఓసీ) మంజూరు చేయించారు.

ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దేవలత కుటుంబ సభ్యులు వైద్య సహాయం కోసం మంత్రి శ్రీధర్ బాబును కోరగా, ఆయన వెంటనే స్పందించి ఆర్థిక సాయం అందేలా చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన ఆసుపత్రి సహాయకులు బాధిత కుటుంబానికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీని అందజేశారు.

ఆపద సమయంలో స్పందించి వైద్య చికిత్సకు ఆర్థిక భరోసా కల్పించిన మంత్రి శ్రీధర్ బాబుకు దేవలత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించేలా మంత్రి చేస్తున్న కృషిపై వారు హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు