పశు వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి

10-10-2026 | 06:12pm

తాడ్వాయి,అక్టోబర్,10 ( విజయక్రాంతి ): రైతులు పశువైద్య శిబిరాలు(Veterinary camps for farmers) సద్వినియోగం చేసుకోవాలని పశువైద్యాధికారి రమేష్ తెలిపారు. కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో శనివారం పశుగణాభివృద్ధి సంస్థ(Livestock Development Corporation) ఆధ్వర్యంలో పశు వైద్య, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పశు వైద్య శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామాల్లో ప్రత్యేకంగా నిర్వహించే పశువైద్య శిబిరాల్లో తమ పశువులకు చికిత్సలు(Treatments) నిర్వహించుకోవాలని సూచించార.

ఈ సందర్భంగా 72 పశువులకు చికిత్సలు నిర్వహించినట్లు తెలిపారు.34 పశువులకు గర్భకోశ చికిత్సలు,27 పశువులకు కృత్రిమ గర్భాదారన చికిత్సలు,11 దూడలకు నట్టల నివారణ మందు చికిత్సలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రంజిత్ రెడ్డి, మండల పశు వైద్యాధికారి రమేష్, సిబ్బంది కొండల్ రెడ్డి, కృష్ణ, గోపాల మిత్రులు బ్రహ్మం,మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు