ఎన్టీఆర్ మహిళా కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
05-09-2026 | 04:56pm
మహబూబ్‌నగర్ అర్బన్ : ప్రాణిక్ ప్రభుత్వ ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాల(Pranik Government NTR Womens Degree College)లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్(Sarvepalli Radhakrishnan) చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ డి. ప్రకాశ్ మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితాల్లో గురువుల పాత్ర ఎంతో గొప్పదని అన్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్‌చార్జ్ డాక్టర్ కె. హరిబాబు, ఉర్దూ విభాగాధిపతి డాక్టర్ మహ్మద్ వహిదుద్దిన్ విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశాలు అందించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.






