ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
తాంసి/భీంపూర్,సెప్టెంబర్ 5(విజయక్రాంతి): సమజ నిర్మాణంలో, రేపటి పౌరుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో అత్యంత కీలక పాత్ర పోషించే ఉపాధ్యాయులను స్మరించుకుంటూ శనివారం ఆదిలాబాద్ జిల్లా తాంసి(Tamsi),భీంపూర్(Bheempoor) మండలాలలో ఉపాధ్యాయ దినోత్సవం(టీచర్స్ డే) వేడుకలను ఘనంగా నిర్వహించారు..భారత మాజీ రాష్ట్రపతి, మహోన్నత తత్వవేత్త, ఆదర్శ ఆచార్యుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్(Sarvepalli Radhakrishnan) జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది..కాగా భీంపూర్ మండలం అర్లి(టీ) జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులు,ఉపాధ్యాయులుగా మరి పాఠాలు బోధించారు..
తల్లిదండ్రులు జన్మనిస్తే, ఆ జన్మకు సార్థకత చేకూర్చే విజ్ఞానాన్ని, నైతిక విలువలను ఉపాధ్యాయులే అందిస్తారు. కేవలం పుస్తకాల్లోని పాఠాలు మాత్రమే కాకుండా జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎలా ఎదుర్కొనాలో నేర్పించేది గురువే...డిజిటల్ యుగంలో సమాచారం సులభంగా లభించినప్పటికీ, విద్యార్థికి విచక్షణను, సంస్కారాన్ని నేర్పించే గురువు స్థానాన్ని ఏ టెక్నాలజీ భర్తీ చేయలేదని ప్రముఖులు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీకాంత్,బలరాం,విజయలక్ష్మి,రేణుక, రవి కిరణ్,సుధాకర్, మోసిన్, తదితరులు పాల్గొన్నారు.






