5 September, 2026 | 6:40 PM

మహిళా శక్తి సంఘాల సోలార్ యూనిట్లకు భూమిపూజ

05-09-2026 | 05:21pm

కొల్లాపూర్ రూరల్(విజయక్రాంతి): మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా చేపడుతున్న సోలార్ యూనిట్ల(Solar units) నిర్మాణ పనులకు రాష్ట్ర మంత్రులు డాక్టర్ దనసరి సీతక్క)Seethakka), జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao), ఎంపీ మల్లు రవి(MP Mallu Ravi), జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ శనివారం భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. కొల్లాపూర్ మండలంలోని అంకిరావుపల్లి, సింగోటం గ్రామాల పరిధిలో ఇందిరా మహిళా శక్తి సంఘాల ఆధ్వర్యంలో రెండు 800 కిలోవాట్ల (11 కేవీ) సోలార్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. 

ఈ యూనిట్ల ద్వారా మహిళా సంఘాలకు ఆదాయ మార్గాలు పెరగడంతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపడి, గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతకు దోహదపడతాయని మంత్రులు తెలిపారు.అంతకుముందు అంకిరావుపల్లి గ్రామంలో రూ.17.78 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న హ్యామ్ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రులు, ఎంపీ, కలెక్టర్ శంకుస్థాపన చేశారు.

మరిన్ని వార్తలు