5 September, 2026 | 6:38 PM

బిచ్కుందలో బిఆర్ఎస్ భారీ ర్యాలీ

05-09-2026 | 05:29pm

విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి 

విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి 

విద్యార్థుల జీవితాలతో చెలగాటం వద్దు 

జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే 

జుక్కల్,(విజయక్రాంతి): తెలంగాణ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Party Working President KTR) ఆదేశాల మేరకు జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రం లో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే(Former MLA Hanmant Shinde) ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ఈ సందర్భంగా పారదర్శకమైన సమాధానాలు కోరుతూ ఈ ర్యాలీ, నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ మేరకు ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు సంబంధించిన పథకాలను సమయానికి అమలు చేయాలన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను పెండింగ్ లో ఉంచరాదన్నారు. విద్యాసంస్థల్లో మౌలిక వసతులను మెరుగుపరచి, విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై శ్వేతపత్రం, పురోగతి నివేదికను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు రాజకీయాలకు బలి కాకూడంటే 

ప్రశ్నించడం మన హక్కుగా భావించి పోరాడాలన్నారు. తాము విద్యార్థుల సమస్యల పట్ల అడుగుతున్న ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.  విద్యార్థుల సమస్యలకు పరిష్కారం కావాలని, హామీల అమలుపై సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు న్యాయం చేసే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు.

మరిన్ని వార్తలు