దుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి

19-10-2026 | 06:29pm

ఎమ్మెల్యే అనురుద్ రెడ్డి

రాజాపూర్: దుర్గమ్మ చల్లని దయతో జడ్చర్ల నియోజకవర్గం ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి(MLA Anirudh Reddy) అన్నారు.  సోమవారం మండల పరిధిలోని రాయపల్లి గ్రామం(Rayapally village)లో భవాని మాత ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలందరూ దుర్గామాత దయతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గాయత్రి మల్లేష్ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శేఖర్ గౌడ్, విక్రం రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, రమేష్, ఉద్దేశ్ గౌడ్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు