గణపతి మండపాలను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి

20-09-2026 | 07:55pm

కౌకుంట్ల : దేవరకద్ర నియోజకవర్గంలోని కౌకుంట్ల మండలం పేరూరు, వెంకంపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన పలు గణపతి మండపాలను మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి(Former MLA Ala Venkateswar Reddy) శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా మండపాల్లో ప్రతిష్ఠించిన గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్న మండపాల నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు