కరెంటు కోతలతో ఎండిపోతున్న పంటలు

19-09-2026 | 09:08pm

విద్యుత్ సబ్ స్టేషన్ ముందు బిఆర్ఎస్ ధర్నా

భూత్పూర్, సెప్టెంబర్ 19 : కరెంటు కోతలతో వ్యవసాయ (Agriculture) పొలంలో వేసుకున్న పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం భూత్పూర్ (Bhootpur)మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ముందు బిఆర్ఎస్ పార్టీ (BRS Party)ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ చైర్మన్ బస్వా రాజ్ గౌడ్ మాట్లాడుతూ రైతులు వేసుకున్న పంటలకు నీరు అందాల్సిన సమయంలో కరెంటు సరఫరా నిలిచిపోతున్నాడంతో పొలాలు ఎండిపోతున్నాయని ఆయన వాపోయారు.

వరి పంట కోత దశకు చేరుకుంటున్న సమయంలో విద్యుత్ కోతల కారణంగా పంటలను కాపాడుకోవడం ఎలా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు 24 గంటలు కరెంటును అందించామని, ఎన్నికల్లో 24 గంటలు కరెంటు అందిస్తాం అన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చాక 16 గంటలకు కూడా కరెంటు ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

కరెంటు కోతలతో రైతులు విలవిల లాడుతున్నారని తెలిపారు. కరెంటు కోతలతో రైతుల ఇబ్బందులు పడుతుంటే అధికారులు పట్టించుకోవడం లేదంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ కోతలు లేకుండా చూడాలని ఏఈ కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అశోక్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మురళీధర్ గౌడ్, నారాయణ గౌడ్, గోప్లాపూర్  సత్యనారాయణ, తూము శ్రీనివాస్ రెడ్డి,  చంద్రశేఖర్ గౌడ్, అశోక్ గౌడ్, రాము నాయక్, ఆయా గ్రామాల సర్పంచులు ఆల శ్రీకాంత్ తో పాటు టౌన్ అధ్యక్షుడు సురేష్ గౌడ్,  బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు