వాడిగా.. వేడిగా మండల స్థాయి సమీక్ష సమావేశం

03-10-2026 | 10:10pm

బాలానగర్,(విజయక్రాంతి): బాలానగర్ మండల(Balanagar Mandal) కేంద్రంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయ సమావేశ(MPDO Office Meeting) మందిరంలో శనివారం మండల స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులను సర్పంచులు తమ సమస్యలను విన్నవించారు. మండలంలోని పలు గ్రామాలలో కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న లూస్ లైన్స్, లో వోల్టేజ్ విద్యుత్ సమస్యలపై విద్యుత్ శాఖ(Electricity Department) ఏఈని నిలదీశారు.

మండలంలోని పలు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను పూర్తిచేయాలని మండల విద్యాధికారిని కోరారు. కొన్ని గ్రామాలలో మిషన్ భగీరథ నీరు రావడంలేదని, మిషన్ భగీరథ పైపు లైను లీకేజీ ఉన్న సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని తెలిపారు. ఈ మండల స్థాయి సమీక్ష సమావేశంలో మండల స్థాయి సంబంధిత శాఖ అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు