నార్కోటిక్ డాగ్‌తో విస్తృత తనిఖీలు
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ పట్టణంలో(Mahabubabad town) గంజాయి(Marijuana), ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా(Illicit drug trafficking), నిల్వ, విక్రయాలను అరికట్టేందుకు టౌన్ పోలీసులు(Town police) శనివారం నార్కోటిక్ డాగ్(Narcotic Dog) సహాయంతో విస్తృతంగా ప్రత్యేక తనిఖీలు(Special inspections) నిర్వహించారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్(Mahabubabad Town Police Station) పరిధిలోని రైల్వే స్టేషన్(Railway station), ఆర్టీసీ బస్టాండ్, ఎఫ్ ఆర్ వో సెంటర్, నెహ్రూ సెంటర్, ఎం ఆర్ వో సెంటర్, తొర్రూర్ బస్టాండ్ ప్రాంతాలతో పాటు పట్టణంలోని పలు అనుమానాస్పద ప్రాంతాల్లో నార్కోటిక్ డాగ్‌తో పోలీసులు సోదాలు చేపట్టారు.
గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.గంజాయి, డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాలను అక్రమంగా రవాణా చేసినా, నిల్వ ఉంచినా లేదా విక్రయించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ రఘుపతి రెడ్డి హెచ్చరించారు. యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని తెలిపారు.