మణికొండ శివాలయం వద్ద పార్కింగ్ తొలగించాలి
24-11-2026 | 10:28am
మణికొండ,(విజయక్రాంతి): మణికొండ శివాలయం(Manikonda Shiva Temple) వద్ద రహదారికి అడ్డంగా వాహనాలు పార్కింగ్ చేయడంతో ఆలయానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి, రహదారిపై ఉన్న పార్కింగ్‌ను వెంటనే తొలగించి భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని రాజేంద్ర గౌడ్ గురుస్వామి కోరుతున్నారు. ట్రాఫిక్ అధికారులు తక్షణమే స్పందించి వాహనాల పార్కింగ్‌ను క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు.