నాడు సైమన్ గో బ్యాక్ నేడు సర్ గో బ్యాక్

29-09-2026 | 05:25am

మళ్లీ దేశమంతా ఏకమవుతుంది మోదీ కుట్రలు సాగవు: సీఎం రేవంత్

  1. ఎస్‌ఐఆర్ పేరిట 30 కోట్ల ఓట్లను తొలగించే ప్లాన్
  2. ఈసీని సైమన్ కమిషన్‌లా వాడుకుంటున్నరు 
  3. రాష్ట్రాభివృద్ధికి ప్రధానమంత్రి సహకారమేదీ?
  4. తెలంగాణలో విద్యార్థి సంఘాలు చాలా తక్కువ.. ఎన్‌ఎస్‌యూఐ ప్రభావం పెద్దగా లేదు 
  5. ‘ప్రతిదిన్’ కాంక్లేవ్‌లో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు

హైదరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): సైమన్ గోబ్యాక్ నినాదంతో వందేండ్ల కింద దేశమంతా ఏకమైనట్లే ఇప్పుడు ‘సర్’ గో బ్యాక్ నినాదంతో ఏకమవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) అన్నారు. ఎన్నికల కమిషన్‌ను(Election Commission) సైమన్ కమిషన్ మాదిరిగా ఉపయోగించుకునేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని, ఎస్‌ఐఆర్ పేరిట ఓట్లను తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) కాస్తా బ్రిటిష్ జనతా పార్టీలా తయారైందని ఆయన విమర్శించారు. దేశంలో 30 కోట్ల ఓట్లు తొలగించాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

మోదీని ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ల ఓట్లు తొలగించాలని ప్రయత్నం జరుగుతున్నదని మండిపడ్డారు. ఢిల్లీలో సోమవారం ‘ప్రతిదిన్  కాంక్లేవ్’లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడారు. గతంలో బూత్ లెవల్ అధికారం బూత్ లెవల్ అధికారికి, కలెక్టర్ అధికారం కలెక్టర్‌కు ఉండేదని, ఇప్పుడు అన్ని అధికారాలు ఎన్నికల కమిషన్ గుప్పిట్లో పెట్టుకున్నదని దు య్యబట్టారు. భారత రాజ్యాంగ నేతలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని అభిలాషిస్తే.. ప్రధాని మోదీ మాత్రం ఎన్నికల సంఘం పేరుతో పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారని, ఇది కాంగ్రెస్ పార్టీ సమస్య కాదని, దేశ ప్రజాస్వామిక సమస్య అని తెలిపారు.  

‘సర్’ పేరిట కుట్ర

‘1919లో భారత ప్రభుత్వ చట్టం అమలు, దేశంలో పాలనా నిబంధనలు సమీక్షకు 19 28లో సైమన్ కమిషన్‌ను నియమించారు. అందులో ఏడుగురికి ఏడుగురు బ్రిటిషర్లు ఉంటే మాకు ఏం న్యాయం ఏం జరగుతుందని లాలా లజపతిరాయ్ ఉద్యమం లేవదీ శారు. సైమన్ గో బ్యాక్ నినాదాన్ని ఇచ్చారు. దేశమంతా ఏకమైంది. ఆందోళనలపై లాఠీఛార్జీ చేశారు. అందులో లాలా లజపతిరా య్ చనిపోయారు. అప్పుడు భగత్ సింగ్ జెండా ఎత్తారు.

వందేండ్ల అనంతరం ఇప్పు డు ప్రధాని మోదీ ఎన్నికల కమిషన్‌ను సైమ న్ కమిషన్ మాదిరిగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నాటి ఎత్తుగడలనే బ్రిటిష్ జనతా పార్టీ వేస్తున్నది. దేశంలో ఎ న్నోసార్లు సర్ ప్రక్రియ జరిగినప్పటికీ ఇప్పు డు మాత్రం ఓటు హక్కును తొలగించేందుకే చేస్తున్నారు’ అని సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సర్’కు వ్యతిరేకంగా దేశమంతా ఏకమవుతుందని.. మమతా బెనర్జీ, శరద్ పవార్, ఉద్దవ్ ఠాక్రే, స్టాలిన్‌తో పాటు అందరూ ఉద్యమిస్తారని, కుట్రలు సాగబోవని ఆయన అన్నారు. 

జనాభా పెరిగితే ఓట్లు పెరగవా?

‘దేశంలో జనాభా పెరిగితే ఓట్లు పెరుగుతాయి. నాడు దేశంలో 35 కోట్ల జనాభా ఉంటే ఇప్పుడు 140 కోట్ల జనాభా. ఏటా జనాభా పెరుగుతున్నది. మన ఓటు హక్కు ను 21 ఏండ్ల నుంచి 18 ఏండ్లకు తగ్గించుకున్నాం. ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేష్ కుమార్ కలిసి ఓట్లను ఎందుకు తొలగిస్తున్నారు.  2014లో మోదీ ప్రధాని అయిన ప్పుడు 81 కోట్ల ఓట్లు, ఆ తర్వాత 2019లో 91 కోట్ల ఓట్లు, 2024లో 97 కోట్ల ఓట్లు ఉంటే.. ఇప్పుడు 30 కోట్ల ఓట్లు తొలగించాలని మోదీ చూస్తున్నారు. తనను ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ల ఓట్లు తొలగిస్తారు.

బీజేపీ వాళ్లకు ఉన్న ఆయుధం వాట్సాప్, సోషల్ మీడియా. ఎవరైతే వాళ్లకు వ్యతిరేకంగా పోస్టులు పెడతారో ఆ పోస్ట్ పెట్టిన వారి ఓట్లు తొలగిస్తారు’ అని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఏఐ టెక్నాలజీ వాడి ఓట్లు తీసివేస్తున్నారని, ముగ్గురు ఎన్నికల కమిషనర్లలో ఇద్దరు కమిషనర్లకు తెలియకుండా సీఈసీ జ్ఞానేష్ కుమార్ అన్ని నిర్ణ యాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను నార్త్‌కొరియా అధ్యక్షుడు కిమ్ వద్దకు శిక్షణకు పంపిస్తే.. ఇక్కడికి వచ్చి మోదీకి వందకు వంద శాతం ఓట్లు వేయిస్తారని ఆయన విమర్శించారు. 

ఎన్‌ఎస్‌యూఐ ప్రభావం లేదు

తెలంగాణలో బీజేపీకి పెద్దగా ప్రాధాన్యం లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘తెలంగాణలో విద్యార్థి సంఘాలు చాలా తక్కువ.. లెఫ్ట్, రైట్ సంఘాలున్నాయి. ఎన్‌ఎస్‌యూ ఐ ప్రభావం  పెద్దగా లేదు. ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో రాజకీయాల శైలి వేరు. మా దగ్గర యూనివర్సిటీ లా కా లేజ్, ఆర్ట్స్ కాలేజీ నాయకునిగా ఏబీవీపీలో గెలిచిన వారు తర్వాత కాంగ్రెస్ నుంచి ఎ మ్మెల్యేగా పోటీ చేస్తారు’ అని పేర్కొన్నారు.  ‘రాష్ట్రంలో 2014 ఎన్నికల తర్వాత పోటీ కేసీఆర్, రేవంత్ మధ్య అన్నట్లు మారింది. కేసీ ఆర్ నన్ను అనేక సార్లు జైలుకు పంపారు. నేను అసెంబ్లీకన్నా జైలుకే ఎక్కువ సార్లు వెళ్లాను’ అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 

విద్యా విధానాన్ని గాడిలో పెడుతున్నం

రాష్ట్రం విద్యా విధానాన్ని గాడిలో పెడుతున్నామని.. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ నుంచి 12వ తరగతి వరకు భాష, నైపుణ్యా లు నేర్పుతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అ న్నారు. ‘12వ తరగతిలోపు ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పుతున్నాం. 12వ తరగతి తర్వాత నైపుణ్యాలు నేర్పుతున్నాం. మా రా ష్ట్రం నుంచి ఏటా దాదాపు 1.80 లక్షల మం ది ఇంజినీరింగ్ విద్యార్థులు బయటకు వస్తున్నారు. అందులో కేవలం 20 వేల మంది ఉద్యోగాలు పొందుతున్నారు. మిగతా వాళ్లు వాళ్ల చదువు, స్థాయికి తగని ఉద్యోగాలు చే స్తున్నారు.

ఎందుకంటే వాళ్లకు అవసరమైన నైపుణ్యాలు లేవు. అందుకే యంగ్ ఇండి యా స్కిల్స్ యూనివర్సిటీ పెట్టాం. సర్టిఫికెట్ల కోసం చదువు వద్దు.. నైపుణ్యాలు నేర్చుకోవాలని సూచిస్తున్నా. ఉద్యోగాలు కల్పించే నై పుణ్యాలకు సంబంధించిన కోర్సుల రూపకల్పన చేశాం. ఐటీఐలను ఏటీసీలుగా మార్చ డంతో ఉద్యోగాలు వస్తున్నాయి’ అని ఆ యన వివరించారు.  దేశంలో సగటున 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉంటే, తెలంగాణలో 17 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నా టీచర్లను నియమిస్తున్నామన్నారు.

రాష్ట్రాభివృద్దికి మోదీ సహకారమేదీ?

గుజరాత్ సీఎంగా మోదీ ఉన్నప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ హుందాతనంతో వ్యవహరించి గుజరాత్ అభివృద్ధి చాలా సహకరించారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. “నాడు మన్మోహన్ సింగ్ మోదీకి ఇచ్చిన మద్దతులో 10 శాతం కూడా మోదీ మాకు ఇవ్వడం లేదు. మేం కలిసినప్పుడు ఆయన మంచిగానే ఉంటారు. కానీ మా రాష్ట్రానికి మెట్రో రైలు, రీజినల్ రింగు రోడ్డు, జాతీయ రహదారుల విస్తరణకు ఏమాత్రం సహకరించడం లేదు. 360 కిలోమీటర్ల రీజినల్ రింగు రోడ్డుకు టెండర్లు పిలిచాం.

రెం డేండ్లవుతున్నా పీఎం కార్యాలయంలోనే ఉండిపోయింది. మేం నితిన్ గడ్కరీని ఎప్పు డూ అడిగినా.. ‘నా చేతిలో ఏమీ లేదు, మోదీ దగ్గర  ఫైల్ ఉంది’ అంటారు. సెమీ కండక్టర్ ప్రాజెక్టును చివరి నిమిషంలో గుజరాత్ తీసుకెళ్లారు.  ఇది ఉత్తరాది, దక్షిణాది అంశం కాదు.. గుజరాత్, మిగతా దేశం వ్యవహారంలా ఉంది. మోదీ ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా గుజరాత్‌కే అన్నీ తీసుకెళ్లుతున్నారు” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చిన్న రాష్ట్రాలను ఖతం చేస్తారేమో!

నియోజకవర్గాల పునర్విభజన సమస్య అనేది రాజకీయాల అంకెల ఆటలా మారిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. “రాజకీయా ల్లో మీ దగ్గర సంఖ్యా బలం ఉంటేనే ఢిల్లీకి పిలిచి మాట్లాడుతుంది. లేకపోతే గేటు దగ్గరకు రానివ్వరు. అందుకే నేను సాధారణ మైన పరిష్కారం చూపుతున్నాను. 1976లో ఇందిరా గాంధీ  543 సీట్లకు లోక్‌సభ స్థానాలను ఫ్రీజ్ చేశారు. కేంద్రం కుటుంబ నియం త్రణ పిలుపునిస్తే దక్షిణాది రాష్ట్రాలు అమలు చేశాయి. ఉత్తరాదిలో అది జరగలేదు.

దీం తో జనాభాలో హెచ్చుతగ్గులు పెరిగా యి. అందుకే ఇందిరా గాంధీ  25 ఏళ్లు  ఆ సంఖ్య ను ఫ్రీజ్ చేశారు. తర్వాత  వాజ్‌పేయి మరో 25 ఏళ్లు దాన్ని పొడిగించారు. 2026లో మోదీ అలానే మరో 25 ఏళ్లు పొడిగిస్తే ఎవరికీ ఇబ్బంది రాదు. కానీ, మోదీ మాత్రం డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల పేరుతో పెద్ద రాష్ట్రాలకు మరింత ప్రాతినిధ్యం పెంచుతూ, చిన్న రాష్ట్రాలను ఖతం చేయాలని చూస్తున్నారు”  అని ఆరోపించారు. 

మేం శివభక్తులం.. వాళ్లు రామ భక్తులు   

‘మేం (దక్షిణాది) ద్రావిడులం. వాళ్లు (ఉత్తరాది) ఆర్యులు. మేం శివ భక్తులం. వాళ్లు రామ భక్తులు. వాళ్లు రాముని సొమ్ము తిన్నారు. మోదీ ఎందుకు హరహర మహదేవ్ అనరు. బీజేపీ నేతలు వేదికలపై జై శ్రీరాం అంటారు, హరహర మహదేవ్ ఎందుకు అనరు. శివుడు పేదల దేవుడు.. శ్రీరాముడు సంపన్నుల దేవుడు. బీజేపీ సంపన్నుల పార్టీ” అని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు