ఘనంగా విజయదశమి వేడుకలు

21-10-2026 | 08:47pm

కొడిమ్యాల, అక్టోబర్ 21 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా(Jagtial district) కొడిమ్యాల మండల కేంద్రంలోని లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం విజయదశమి దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత, వాహన పూజలు నిర్వహించడం జరిగింది. సాయంత్రం శమీ వృక్షానికి పూజ ఆలయ అర్చకులు నాగరాజు రమేష్ నిర్వహించడం జరిగింది. తరువాత భక్తులకు దీపాల వెలుతురులో స్వామివారు దర్శనమిచ్చారు. అర్చనలు హారతులు తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జీవన్ రెడ్డి, ఉపసర్పంచ్ గుర్రం నరసయ్య, వార్డు సభ్యులు, నిర్మాణ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు