శ్రీనివాస మిత్రుల తృతీయ వార్షికోత్సవ పోస్టర్ ఆవిష్కరణ

21-10-2026 | 10:22pm

ప్రత్యేక పూజలు, గోసేవ

కొడిమ్యాల, అక్టోబర్ 21 (విజయక్రాంతి): తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ(Telangana Srinivasula Seva Samstha) ఆధ్వర్యంలో బుధవారం కరీంనగర్‌లోని గిద్దె పెరుమాళ్ దేవాలయంలో శ్రీనివాస మిత్రుల తృతీయ వార్షికోత్సవానికి సంబంధించిన తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ సభ్యులు ఆలయ ప్రధాన అర్చకులు శంకర్ శర్మ సమక్షంలో స్వామివారి సన్నిధిలో పోస్టర్, ఆహ్వాన పత్రికలను వినాయకుడి చెంతన ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ నెల 25వ తేదీన ఆదివారం కోరుట్లలోని జీఎస్ గార్డెన్స్‌లో జరగనున్న శ్రీనివాస మిత్రుల తృతీయ వార్షికోత్సవం విజయవంతం కావాలని, కార్యక్రమానికి విచ్చేసే భక్తులు, శ్రీనివాస మిత్రులపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు. ప్రత్యేక పూజల అనంతరం వార్షికోత్సవ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

అనంతరం ఆలయ ప్రాంగణంలోని గోశాలలో గోసేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి వూట్కూరి, నార్ల శ్రీనివాస్, పెద్ది శ్రీనివాస్, చొక్కారపు శ్రీనివాస్, పైడ శ్రీనివాస్, ఇజ్జగిరి శ్రీనివాస్,గాండ్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు