చీరల పంపిణీ వాయిదా

19-11-2026 | 07:49am

మహిళలకు రేవంత్ సర్కార్ బంపర్ న్యూస్.. నవంబర్ 26న డబుల్ ధమాకా!

హైదరాబాద్: తెలంగాణ మహిళలకు ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. ఇందిరమ్మ చీరల పంపిణీతో(Indiramma Sarees Distribution 2026) పాటు కొత్త చేయూత పెన్షన్ల నగదు జమ కార్యక్రమం వాయిదా పడింది. వాస్తవానికి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న ఈ కార్యక్రమాలను ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. అయితే కొన్ని పరిపాలనా కారణాలతో వీటిని ఈ నెల 26వ తేదీకి మార్చింది. సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేతుల మీదుగా జరగాల్సిన కార్యక్రమాలను విడిగా నిర్వహించాలని నిర్ణయించింది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబర్ 26న రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టనున్నారు. ఈసారి సుమారు కోటి మంది మహిళలకు చీరలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ప్రత్యేకంగా చిలకపచ్చ రంగు చీరలను సిద్ధం చేయించింది. ఎరుపు రంగు జరీ అంచుతో రూపొందించిన ఈ చీరలు ఇప్పటికే జిల్లాలకు చేరుకున్నాయి. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.334 కోట్ల బడ్జెట్ కేటాయించింది.

4.63 లక్షల మందికి చేయూత పెన్షన్ డబ్బులు!

మరోవైపు కొత్తగా అర్హత పొందిన 4,63,857 మంది లబ్ధిదారులకు చేయూత పెన్షన్ల నగదును(Cheyutha Pension Money Release Date) నవంబర్ 26న వారి Bank Accountsలో జమ చేయనున్నారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు తదితర వర్గాలకు ఈ పెన్షన్లు మంజూరయ్యాయి. ఇప్పటికే లబ్ధిదారులకు పెన్షన్ పత్రాల పంపిణీ పూర్తయింది. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.

చీరల కోసం ప్రత్యేక యాప్.. ఎలా పంపిణీ చేస్తారంటే?

చీరల పంపిణీలో పారదర్శకత కోసం ప్రభుత్వం ప్రత్యేక Mobile Appను అందుబాటులోకి తీసుకొస్తోంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాల్లోని మహిళలకు వారం రోజుల పాటు పంపిణీ చేపట్టనున్నారు. పంపిణీ కేంద్రాల్లో లేదా ఇంటి వద్దకు వచ్చే సిబ్బందికి మహిళలు తమ Aadhaar ID చూపించాలి. అధికారులు యాప్ ద్వారా ఫొటో తీసి వివరాలను Verify చేసిన అనంతరం చీరలు అందజేస్తారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బందితో పాటు SERP ఉద్యోగులకు ఈ బాధ్యతలు అప్పగించారు.

మరిన్ని వార్తలు