శాంతి టాకీస్ లో కొత్త సినిమా!
ప్రముఖ నిర్మాణ సంస్థ శాంతి టాకీస్(Prominent production house Shanthi Talkies) తమ కొత్త సినిమాను ప్రకటించింది. అరుణ్ విశ్వ(Arun Vishwa) నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్గా(Shruti Haasan - heroine) నటించనుంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న హారర్ థ్రిల్లర్(Horror Thriller) ‘అశ్విన్స్(Ashwins)’తో గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ తేజ(Tarun Teja) ఈ సినిమాకు కథ అందిస్తూ దర్శకత్వం వహించనున్నారు. తరుణ్ తేజ దర్శకత్వ శైలికి శ్రుతి హాసన్ నటన తోడవడంతో ఈ ప్రాజెక్టుపై ఆసక్తి నెలకొంది. తమిళ, తెలుగు, హిందీ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రుతి హాసన్, విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ మంచి నటిగా పేరు తెచ్చుకుంది.
నటనతో పాటు సింగర్‌గా, మ్యూజీషియన్‌గా కూడా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. ప్రతి సినిమాలో తనదైన ప్రత్యేకతను చూపించే శ్రుతి హాసన్, శాంతి టాకీస్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ కొత్త తమిళ సినిమాలో లీడ్ రోల్లో కనిపించనున్నారు. ఈ ప్రాజెక్టుతో శాంతి టాకీస్ మరో కొత్త జానర్‌ను టచ్ చేస్తూ, ప్రేక్షకుల ముందుకు విభిన్నమైన కథను తీసుకురానుంది. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలోనే వెల్లడిస్తారు.