గురునానక్ జయంతి వేడుకలు
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహణ
హైదరాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి): నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో(Nampally Exhibition Grounds) సోమవారం గురునానక్ మహారాజ్ జయంతి వేడుకలు(Guru Nanak Maharaj Jayanti Celebrations) విశాల్ దివాస్(Vishal Divas) (కీర్తన్ దర్బార్) నిర్వహించారు. గురు సింగ్ సభ అశోక్ బజార్ గురుద్వారా నిర్వహణ కమిటీ అధ్యక్షుడు సర్దార్ గురు చరణ్ సింగ్ బగ్గా, సికింద్రాబాద్ గురుద్వారా నిర్వహణ కమిటీ అధ్యక్షుడు సర్దార్ కుల్దీప్ సింగ్ సలూజా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Union Minister Kishan Reddy), బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై సామూహిక కీర్తన్ దర్బార్‌లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి, రాంచందర్‌రావు మాట్లాడుతూ.. దేశ రక్షణ కోసం అనేకమంది సిక్కులు ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించారని కొనియాడారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ దేశ రక్షణకు సిక్కులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. అనంతరం మైదానంలో ఏర్పాటు చేసిన భారీ లంగర్‌ను వారు సందర్శించారు. పలువురు సిక్కులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. మత గురువులు ఆలపించిన కీర్తనలు, గురునానక్ దేవ్ జీ ప్రవచనాలతో ఎగ్జిబిషన్ మైదానం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
గురుద్వారాల్లో సేవలందించిన పలువురిని ఘనంగా సత్కరించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి తల్వార్‌ను బహూకరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సర్దార్ జోగేంద్ర సింగ్ చావ్లా, సర్దార్ కుల్దీప్ సింగ్ సలూజా, సర్దార్ రణబీర్ సింగ్ గాంధీ, తరందీప్ సింగ్ భాటియా, మీడియా ఇన్చార్జి సర్దార్ సత్నాం సింగ్, జస్పాల్ సింగ్ పుటెజ, మంజీత్ సింగ్ పాలా, గురుదీప్ సింగ్, రవీందర్ సింగ్ సర్నా, జగదీప్ సింగ్ కుటేజా పాల్గొన్నారు.