రేవంత్‌రెడ్డి తెలంగాణ ద్రోహి
- కృష్ణా నీళ్ల విషయంలో అబద్ధాల వరద పారించాడు
- పల్నాడు లిఫ్ట్ స్కీమ్‌ను అడ్డుకుంటామని ఎందుకు అనడం లేదు?
- పదవుల కోసం పెదవులు మూసుకుంది కాంగ్రెస్ నేతలే
- మూడేండ్లలో ఒక్క రిజర్వాయర్ అయినా కట్టారా?
- లిఫ్టులు ఎంతకాలం నడిపారో శ్వేతపత్రం విడుదల చేయాలి: హరీశ్
హైదరాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి): కృష్ణా నీళ్ల(Krishna waters) విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) అబద్ధాల వరదను పారించారని, ఆయన హయాంలో ఇప్పటివరకు ఒక్క రిజర్వాయర్(Reservoir) అయినా కట్టారా? అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడిందే బీఆర్ఎస్(BRS) అని.. నాడైనా నేడైనా తెలంగాణకు ద్రోహి రేవంత్‌రెడ్డి అని వ్యాఖ్యానిం చారు. 299:512 టీఎంసీలకు కర్త, కర్మ, క్రియ కాంగ్రెస్ పార్టీ అని దుయ్యబట్టా రు. అసెంబ్లీని పెడితే వారం పదిరోజులు మాట్లాడటానికి తాను సిద్ధమని.. దీనికి ముఖ్యమంత్రి సిద్ధమా అని సవాల్ విసిరారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని తెలిసి రేవంత్‌రెడ్డి ఫ్ట్రస్ట్రేషన్లో బురద రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో మంగళవారం మీడియా సమావేశంలో హరీశ్‌రావు(Harish Rao) మాట్లాడారు. ‘నీళ్లు ఎత్తుమంటే రేవంత్‌రెడ్డి దుమ్మెత్తి పోస్తున్నడు. కేసీఆర్‌ను(KCR) ఉరి తీయాలని అంటున్నడు.. ఎందుకు ఉరి తీయాలి. ఉరివేయాల్సింది రేవంత్‌ను, ఆయన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని. నాగార్జున సాగర్‌కు(Nagarjuna Sagar) ఏపీ పొక్క కొడుతుంటే కుంభకర్ణుడిలా నిద్రపోతున్నారు’ అని మండిపడ్డారు.
ఒక్క చుక్క నీళ్లయినా తెచ్చారా?
కాలిపోయే మోటార్లు, ఎండి పోయిన బావులకు కారణం టీడీపీ, కాంగ్రెస్ కాదా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ‘ఉద్యమ కా లంలో సమైక్య వాదుల సంకలో ఉన్న వ్యక్తి రేవంత్‌రెడ్డి. నాడు రాజీనామా ఇవ్వకుండా జిరాక్స్ కాగితాలు ఇచ్చి నాటకాలు ఆడాడు. అప్పుడూ ఇప్పుడూ తెలంగాణ ద్రోహిగానే ఉన్నడు’ అని ఆయన ఆరోపించారు. ‘తెలంగాణ హక్కుల కోసం కొట్లాడింది, ఉద్యమం చేసింది, పోరాటం చేసింది గులాబీ జెండా. టీడీపీకి అప్పుడైనా ఇప్పుడైనా రేవంత్ కట్టుబానిస. నాడు కేసీఆర్ నిలదీస్తేనే కదా జూరాల నింపి ఆయకట్టుకు నీళ్లు వచ్చింది. గులాబీ జెండా ఎగరడంతోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాంతం తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడకు నీళ్లు వచ్చాయి’అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభు త్వం ఎస్సారెస్పీ నుంచి ధవళేశ్వరం వరకు గోదావరి మీద ఒక్క ఆనకట్టయినా కట్టిందా? ఒక్క చుక్క నీళ్లయినా తెచ్చిందా అని నిలదీశారు. ఎల్లంపల్లి పూర్తి చేసింది, మేడిగడ్డ కట్టింది, అన్నారం, సుందిళ్ల, సమ్మక్క సాగర్, సీతమ్మ సాగర్ కట్టిందిబీఆర్ఎస్ ప్రభుత్వమేనని తెలిపారు. మెదక్ జిల్లాకు ఆయకట్టు బీఆర్ఎస్, కేసీఆర్ వల్లే వచ్చిందని ఆయన అన్నారు. పదవుల కోసం పెదవులు మూసుకున్నది కాంగ్రెస్ నేతలేనని దుయ్యబట్టారు. దేవాదు ల, సీతారామ, కుల్వకుర్తి ఎన్ని రోజులు, ఎన్ని గంటలు లిఫ్టు నడిపారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో క్రాప్ హాలిడే లేదని, తెలంగాణలో మాత్రం ఉందని అన్నారు.
10లక్షల ఎకరాలకు నీళ్లిచ్చినం
30 ఏండ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో పాలమూరుకు 30వేల ఎకరాలకు నీళ్లు ఇస్తే, కేసీఆర్ 10లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చారని హరీ శ్‌రావు తెలిపారు. 4వేల కోట్లు ఖర్చు పెట్టి పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చామన్నారు. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక ఆయన గురువు చంద్రబాబు 2024 డిసెంబర్ 3న జీవో 403, 405 ఇచ్చారు. వాటి ద్వారా 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పంకు నీళ్లు పారాయి. పాలమూరుకు మాత్రం కృష్ణా జలాలు రాలేదు. పాలమూరులో దాదాపు 2లక్షల ఎకరాలకు పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది. 20 లక్షల ఎకరా లకు నీళ్లు ఇస్తానని అసెంబ్లీలో పద్దులు పాస్ చేసిన రేవంత్‌రెడ్డి.. అందులో 5 శాతం అయినా ఇచ్చిండా? ఇస్తే ప్రజల ముందు శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని డిమాండ్ చేశారు.
పల్నాడుపై ఎందుకనలే?
మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడినవి పచ్చి అబద్ధాలని హరీశ్‌రావు కొట్టిపారేశారు. పల్నాడు లిఫ్ట్ స్కీమ్‌కు టెండర్లు 2025 జనవరిలో పిలిచారని తెలిపారు. ‘నీళ్ల మంత్రిగా ఉత్తమ్‌కు సోయిలేదు, ముఖ్యమంత్రిగా రేవంత్‌కు సోయిలేదు. ఏపీ అక్రమంగా ప్రాజెక్టు కడుతుంటే ఏడాది నుంచి వీళ్లకు కనీస సమాచారం లేదు. రేవంత్ సీఎం అయ్యాకే జీవో నెం 453 వచ్చింది. నాగార్జున సాగర్ కింద నుంచి పొక్క కొట్టి నీళ్లు తీసుకుపోయే జీవో అది. రేవంత్ సీఎం అయ్యాక వచ్చిన 458 జీవోలో 1.865 టీఎంసీలు నాగార్జునసాగర్ నుంచి తీసుకుంటామని స్పష్టంగా ఉంది’ అని చెప్పారు. పల్నాడు స్కీమ్‌ను అడ్డుకుంటామని మీడియా సమావేశంలో ఒక్క మాటా రేవంత్ ఎందుకు అనలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
299 వాటా తెచ్చింది వాళ్లే...
299:512 టీఎంసీలకు కర్త, కర్మ, క్రియ కాంగ్రెస్ పార్టీ అని మాజీమంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ‘పీకే మొహంతి చీఫ్ సెక్రటరీగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన కాపీలో ఈ విషయం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో నాటి కాంగ్రెస్, టీడీపీ పాలకులు కృష్ణా జలాల్లో తెలంగాణకు 299కి పరిమితం చేశారు. విభజన బిల్లులో పెట్టింది మీ కాంగ్రెస్ ప్రభుత్వం కదా?’ అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. దీనిపై తెలంగాణ వచ్చిన 42 రోజుల్లో కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి సెక్షన్ 3 కింద కంప్లయింట్ ఇచ్చారని తెలిపారు. కావాలని రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
అసెంబ్లీ పెట్టు.. తేల్చుకుందాం..
‘వారం పది రోజులు అసెంబ్లీలో మాట్లాడడానికి నేను సిద్ధం. అసెంబ్లీ పెట్టు.. మైకులు కట్ చేయొద్దు. దీనికి నువ్వు సిద్ధమా?’ అని సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు సవాల్ విసిరారు. మూడేండ్ల నుంచి ట్రిబ్యునల్ ముందు వాదనలు కూడా వినిపించడం ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదన్నారు. ‘ఇన్ని మాట్లాడిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 17.02.2025 మీటింగ్‌లో అదే 299:512 తాత్కాలిక ఒప్పందానికి ఒప్పుకున్నారు. అంటే నువ్వు మరణశాసనం రాసినట్లా? మీరు గట్టిగా పోరాడితే తెలంగాణకు న్యాయమైన నీటి వాటా దక్కుతుందన్నారు. రాయలసీమ లిఫ్ట్ గురించి కూడా రేవంత్ రెడ్డి అదే పచ్చి అబద్ధం ఆడారు. కేఆర్ఎంబీ మీటింగ్ జరిగితే 04.06.2020 నాడు మేం రాయలసీమను అడ్డుకున్నాం..’ అని పేర్కొన్నారు.
కేసీఆర్ అన్నీ గమనిస్తున్నారు
‘నాడు మేం మంత్రలయ్యింది కేసీఆర్ భిక్షవల్ల. కానీ, వైఎస్సార్ ఎవరు? మేం రాజీనామాలు చేసిన తర్వాత పోతిరెడ్డిపాడు జీవో వచ్చింది. ఆ నాడు పదవుల కోసం పెదవులు మూసుకున్నది, ఎంగిలి మెతుకుల కోసం మోసం చేసింది కాంగ్రెస్ నాయకులు’ అని హరీశ్‌రావు అన్నారు. గ్రావిటీ ద్వారా నీళ్లు తెస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మాట మార్చారని ఆయన దుయ్యబట్టారు. ‘రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై ఆయన ఎమ్మెల్యేలే అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని రేవంత్‌కు అర్థమైంది.
అందుకే కుట్రలు చేస్తున్నడు’ అని వ్యాఖ్యానించారు. నిద్రలో కూడా కేసీఆర్‌నే రేవంత్ కలువరిస్తున్నారని, ఆయన ప్రెస్‌మీట్ పెడితే కేసీఆర్ పేరు 50 సార్లు ఉంటదని విమర్శించారు. బీఆర్ఎస్ గెలుపు ఖాయమైందని, అందుకే ఫ్రస్ట్రేషన్లో బురద రాజకీయాలు పాల్పడుతున్నారని సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కేసీఆర్ అన్నీ గమనిస్తున్నారు. ఎప్పుడు రావాలో అప్పుడే వస్తారు. ప్రజాక్షేత్రంలో అన్నీ ఎండగడుతారు’ అని హెచ్చరించారు. మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేతలు మధుసూదనాచారి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, దేవి ప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.