తెలంగాణ అడవుల్లో రూపుదిద్దుకున్న అవతార్ ఇది!

17-11-2026 | 05:25am

ఖుషీ ఎంటర్‌టైన్‌మెంట్(Khushi Entertainment) పతాకంపై విహాన్ కార్తీక్ హీరోగా(Vihaan Karthik  hero.) ఎంజే నాయుడు దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రం ‘కెరూబ్(Kerub)’. ‘గత, వర్తమాన, భవిష్యత్తు’ అది ట్యాగ్‌లైన్. దివ్య విశ్వకర్మ, కల్పలత, సుమన్ శెట్టి, గడ్డం సురేశ్, శ్రీధర్ మాడ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం సత్య రాధాకృష్ణ అందించగా, రమేశ్ తోకల సినిమాటోగ్రఫీ అందించారు. నవంబర్ 20న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సోమవారం జరిగింది. ఈ వేడుకలో సీనియర్ దర్శకుడు సముద్ర మాట్లాడుతూ.. “ఈ సినిమా టీజర్, ట్రైలర్ చూడగానే.. మన ఆదిలాబాద్ ఫారెస్ట్‌లో చేసిన ‘అవతార్’లాగా అనిపించింది.

మరో ‘రామాయణం అంత హిట్ కావాలని కోరుకుంటున్న” అన్నారు. హీరో విహాన్ కార్తీక్ మాట్లాడుతూ.. “నేను ఓ తెలుగు సినిమాలో విలన్‌గా నటించా. అప్పుడే ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. దర్శకుడు ఎన్నో రకాలుగా ఆలోచించి ఓ కొత్త ఫేస్ కావాలని నన్ను ఎంచుకున్నారు. దర్శకుడు ఎంతో డీటెయిల్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు” అని తెలిపారు. చిత్ర దర్శకుడు, నిర్మాత ఎంజే నాయుడు మాట్లాడుతూ.. “నాకు చాలా భావోద్వేగంగా ఉంది.

ఎందుకంటే ఈ సినిమా జర్నీలో ఇక్కడిదాకా రావడంతోనే నాకు విజయం దక్కింది. ఇకపై సక్సెస్ వచ్చినా, ఫెయిల్యూర్ వచ్చినా అదంతా బోనస్. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరుతున్నా” అని చెప్పారు. సంగీత దర్శకుడు సత్య రాధాకృష్ణ , డీవోపీ రమేశ్ తోకల, లిరిక్ రైటర్స్: అలరాజు ఆర్ట్ డైరెక్టర్ కొక్కుల ప్రసాద్ కూడా ఈ వేడుకలో మాట్లాడారు. 

మరిన్ని వార్తలు