అరుంధతి నక్షత్రంకు పూజ!
ఆది సాయికుమార్(Aadi Saikumar) హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘అరుంధతి నక్షత్రం(Arundhati Nakshatram)’. మేఘ శెట్టి, మధు దామరాజు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో(The Great Pre-Wedding Show)’ సినిమాతో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్న దర్శకుడు రాహుల్ శ్రీనివాస్(Rahul Srinivas) రూపొందిస్తున్నారు. 7 పి.ఎం. ప్రొడక్షన్స్, శ్రీ చక్ర మూవీస్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్లపై సందీప్ అగరం, అస్మిత రెడ్డి బాసాని, డాక్టర్ సూర్యకాంతి కూచిభొట్ల నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి యాక్టర్ సాయికుమార్ క్లాప్ ఇచ్చారు.
ప్రొడ్యూసర్లు రమేశ్ పుప్పాల, సూర్యకాంతి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. చిత్ర నిర్మాతలు స్క్రిప్ట్ అందించారు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ఈ నెలలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సురేశ్ బొబ్బిలి సంగీత దర్శకత్వం వహిస్తుండగా, డీవోపీగా ఫహాద్ అబ్దుల్ మజీద్, ఎడిటర్‌గా నరేశ్ అడుపా, ప్రొడక్షన్ డిజైనర్‌గా ప్రియ నాయర్ పనిచేస్తున్నారు.