వాడవాడలా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు

10-10-2026 | 10:40pm

మేడిపల్లి, అక్టోబర్ 10 (విజయక్రాంతి); బోడుప్పల్ సర్కిల్(Boduppal Circle) పరిధిలోని వివిధ కాలనీలలో, వాడ వాడల ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. మహిళలు, యువతులు, చిన్నారులు సంప్రదాయ వస్త్రధారణలో(Traditional attire) రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి, ఆట, పాటలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు(Telangana Culture and Traditions) ఉట్టిపడేలా భక్తిశ్రద్ధలతో బతుకమ్మ పాటలు పాడుతూ, ఆడపడుచులు ఐక్యతగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు.

మరిన్ని వార్తలు