సింగరేణి పూర్వవైభవం
- సంస్థను బలోపేతం చేసి, భవిష్యత్తు తరాలకు ఉపాధి భద్రత
- కీలక ఖనిజాల రంగంలోకి విస్తరణే లక్ష్యం
- ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాల్సిందే
- సింగరేణి జీఎంల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి
హైడరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాం తి): సింగరేణికి పూర్వ వైభవం తేవడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) పేర్కొన్నారు. సంస్థను బలోపేతం చేసి, భవిష్యత్తు తరాలకు ఉపాధి భద్రత క ల్పించడంతో పాటు బొగ్గు ఉత్పత్తి వ్యయం తగ్గించడం, ఉత్పాదకత పెంచడం, కొత్త గనులను అభివృద్ధి, కీలక ఖనిజాల అన్వేషణలో కి సంస్థను విస్తరించాలనే ఆలోచనలో ప్రభు త్వం ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సంస్థ అధికారులకు సూచించారు.
సింగరేణి కాలరీస్ జనరల్ మేనేజర్లతో ఆదివారం ప్ర జాభవన్లో నిర్వహించిన ముఖాముఖిలో సంస్థ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై వారికి దిశానిర్దేశం చేశారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంస్థ సాధించిన ప్రగతిని అధికారులు వివరించారు. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల గతంలో కేటాయించిన బొ గ్గు బ్లాకులను కూడా మళ్లీ వేలం ప్రక్రియలోకి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని భట్టి తెలిపారు.
సింగరేణి బొగ్గు ఉత్పత్తి వ్య యం అధికంగా ఉంటే మార్కెట్లో ఇతర సరఫరాదారు లతో పోటీ పడటం కష్టమవుతుం దని, ఉద్యోగుల భవిష్యత్తుపైనా ప్రభావం పడుతుందని హెచ్చరించారు. ఉత్పత్తి వ్య యాన్ని తగ్గించడం, సిబ్బంది, యంత్రాలను సమర్థంగా వినియోగించుకోవడం, పని వి ధానాలను మెరుగుపరచడం ద్వారా ఉత్పాదకత పెంచాలని సూచించారు.
రాగి, బంగా రం, వెనేడి యం, లిథియం వంటి కీలక ఖనిజాల అన్వేషణ, తవ్వకాల్లోకి ప్రవేశించాలని సూచించారు. పదేళ్లు అధికారంలో ఉండి సింగరేణిని పట్టించుకోకుండా, నిర్వీర్యం చేయాలని చూసినవారే ఇప్పుడు నష్టం జరుగుతుందంటూ విమర్శలు చేయడం విడ్డూ రంగా ఉందని విమర్శించారు. సింగరేణి సంస్థ సీఎండీ మరియు చైర్మన్ డా.బుద్ధ ప్ర కాష్ జ్యోతి మాట్లాడుతూ..
ప్రజా ప్రభుత్వం దిశానిర్దేశంతో సింగరేణి సంస్థను దేశంలోనే అగ్రగామిగా నిలిపేలా కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఇందుకోసం అందరూ కలిసిగట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.