పాలకులకు వ్యక్తిగత కక్షలుండకూడదు

26-10-2026 | 05:10am
  1. పదవికి న్యాయం చేస్తున్నామనేదే ముఖ్యం
  2. రేవంత్.. డంపింగ్ సమస్యకు పరిష్కారంచూపు
  3. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్      

జవహర్ నగర్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): పరిపాలకులకు వ్యక్తిగత కక్షలుం డకూడదని.. పదవులు గొప్ప కాదని ఆ పదవికి న్యాయం చేస్తున్నామని ముఖ్యమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Malkajgiri MP Eatala Rajender) పేర్కొన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్‌లో నెలకొన్న డంపింగ్ యార్డ్ సమస్యల నుంచి శాశ్వత పరిష్కారం కోసం హైదరాబాద్ టూరిజం హోటల్‌లో పర్యావరణ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మేధావులు, పర్యావరణవేత్తలు డంపింగ్ యార్డ్ వల్ల ఎదుర్కొంటున్న బాధలను వివరించారు. అనంతరం ఈటల రాజేందర్ హాజరై మాట్లాడుతూ జవహర్ నగర్‌లో గరీబోళ్లు ప్రాణాలు అరచేతుల పెట్టుకొని జీవిస్తున్నారని ఈ విషయమై కంచెయే చేను మేసినట్టు పాలకులు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

ప్రజలకు చట్టాలపై నమ్మకం పోతుందని రాంకీ డబ్బు పలుకుబడితో కోర్టులు ఇచ్చిన తీర్పులను కూడా అమలు చేయకుండా కాలయాపన చేస్తుందన్నారు. రాంకీ సీఎస్‌ఆర్ డబ్బులు ఇక్కడ తాగునీరు, రోడ్లు ప్రజలకు ఖర్చు చేయకుండా వేరే రాష్ట్రాల్లో ఖర్చుపెడుతుందన్నారు.మేము మొదటగా కలిసింది సీఎం రేవంత్ రెడ్డిని జవహర్ నగర్ ప్రజల కోసమేనని తెలిపారు.

ప్రశ్నించే గొంతుక అధికా రాన్ని చేపట్టావు కానీ దీనిని పరిష్కారం చేయాలని కోరితే మీరే మీటింగ్ పెట్టండి అని చెప్పావు కానీ కానీ ఇంతవరకు ఈ విషయమై చిత్తశుద్ధి లేకపోవడం దారుణమన్నా రు. ఇంతకుముందు డంపింగ్ యార్డ్ సమ స్య గురించి పార్లమెంటులో మాట్లాడాలని కేంద్రమంత్రి కట్టర్‌ను కలిసి వివరించానని తెలిపారు.

డంపింగ్ యార్డు సమస్య పరిష్కారంకోసం ఈనెల 27నుంచి పాదయాత్ర మొదలు పెడుతున్నానని తెలిపారు. రాజకీయంలో పదవి గొప్ప కాదని ఆ పదవికి ఎం త న్యాయం చేస్తున్నామన్నదే ముఖ్యమని.. రేవంత్ ఇకనైనాడంపింగ్ యార్డ్ కు శాశ్వత పరిష్కారం చూపించాలనీ లేకపోతే కాలగర్భంలో కలిసిపోతావని దుయ్యబట్టారు.

కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకోవాలి: లక్ష్మణ్ మాదిగ

ఎంఎస్పీ జాతీయ నాయకుడు తిప్పారపు లక్ష్మణ్ మాదిగ మాట్లాడుతూ జవహర్‌నగర్ డంపింగ్ యార్డు పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల్లో సుమారు 80 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పేదలేనన్నారు. పేదలు, అణగారిన వర్గాలు అధికంగా నివసించే ప్రాంతం కావడంతోనే పాలకులు సమస్యను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆవేదన ప్రజల్లో ఉందన్నారు.

ప్రజల ఆరో గ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం సమగ్ర అధ్యయనం చేపట్టాలని, కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకోవాలని, డంపిం గ్ యార్డును తొలగించేందుకు స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేశపాక రామచంద్ర, నరసింహారావు, శ్రీకృష్ణ, వండ్రపల్లి శివ, వెంకటేశ్వర్లు, మేధావులు, ప్రొఫెసర్లు, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్, వివిధ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు