ఎఫ్‌ఎంజీలపై వివక్ష తగదు
- వాళ్లకూ నెలకు రూ. 29,792 స్టైఫండ్ చెల్లించాలి
- సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరిస్తారా?
- సీఎం, వైద్య శాఖ మంత్రి తక్షణమే స్పందించాలి
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి): విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసి ఇక్కడ హౌస్ సర్జన్ల స్టుఫైండ్ చెల్లింపుల్లో వివక్ష తగదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు(BJP State President Ramchander Rao) పేర్కొన్నారు. ఇక్కడి విద్యార్థులకు ఇస్తున్నట్లుగా వారికి సైఫండ్ చెల్లించాలని కోరారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఎదుట 34 రోజులుగా నిరసన తెలుపుతున్న విదేశీ వైద్య పట్టభద్రులపై పోలీసులు లాఠీచార్జ్ చర్యలను ఆయన ఖండించారు. గురువారం తనను కలిసిన ఎఫ్‌ఎంజీ వైద్య విద్యార్థుల బాధలను ఆలకించారు. అనంతరం రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో అనేక ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నా కొందరు విదేశాలకు వెళ్లి చదువుకుని తిరిగి స్వదేశానికి వస్తున్నారని తెలిపారు. భారత నేషనల్ మెడికల్ కమిషన్ పరీక్షలో ఉత్తీర్ణులై ఇక్కడి ప్రభుత్వ ఆస్పత్రుల్లో హౌస్ సర్జన్లుగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. అయితే, స్థానిక హౌస్ సర్జన్ల మాదిరి రూ. 29,792 వరకు స్టైఫండ్ ఎఫ్‌ఎంజీలకు అందడం లేదని పేర్కొన్నారు.
సమాన విద్యార్హత ఉండి, అంతే స్థాయిలో శ్రమిస్తున్న ఎఫ్‌ఎంజీలకు రూ. 5 వేలు మాత్రమే చెల్లించడం వివక్షేనని ఆగ్ర హం వ్యక్తం చేశారు. ’సమాన పనికి సమాన వేతనం’ ఇవ్వాలని, ఇతర హౌస్ సర్జన్లతో సమానంగా స్టైఫం డ్, అలవెన్సులు అందించాలనే సుప్రీంకోర్టు తీర్పు ను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం కోర్టు ధిక్కారమేనని మండిపడ్డారు.
పొరుగు రాష్ట్రాలు, దేశంలోని ఇతర రాష్ట్రాలు ఈ నిబంధనను అమలు చేస్తున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మొండివైఖరి ప్రదర్శిస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎఫ్‌ఎంజీ ఇంటర్నల్స్‌ందరికీ ఇతర హౌస్ సర్జన్లతో సమానంగా రూ. 29,792 స్టైఫండ్‌తోపాటు పెం డింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. సమాజానికి ప్రాణం పోసే వైద్య విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం కనీస వేత నం కూడా చెల్లించలేదా అని ప్రశ్నించారు. ఎఫ్‌ఎంజీ విద్యార్థుల న్యాయమైన పోరాటానికి బీజేపీ సంపూ ర్ణ సంఘీభావం తెలుపుతున్నదని ప్రకటించారు.