నేడు, రేపు భారత్ సమ్మిట్
- నగరానికి చేరుకున్న విదేశీ ప్రతినిధులు
- ఆహుతులకు సర్కారు స్వాగత విందు
- నేటి సెషన్లో ప్రియాంక గాంధీ, సల్మాన్ ఖుర్షీద్ ప్రసంగం
- రేపు రాహుల్‌గాంధీ, ఏఐసీసీ చీఫ్ ఖర్గే హాజరు
- ప్రపంచ సమస్యల పరిష్కార వేదిక : మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి): ప్రపంచ ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, నూతన ప్రపంచ క్రమంపై మేధోమధనం జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్- తెలంగాణ రైజింగ్(Bharat Summit- Telangana Rising)’ సదస్సుకు వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు గురువారం హైదరాబాద్‌కు చేరుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వివిధ దేశాల ప్రతినిధులు రాష్ట్ర అసెంబ్లీ, ఉపాధి హామీ పను ల ప్రదేశాలు, చారిత్రక, రాజకీయ ప్రాధాన్యత గల ప్రాంతాలను సందర్శించారు. రాత్రి నోవాటెల్‌లో విదేశీ ప్రతినిధులకు స్వాగత విందు ఏర్పాటు చేయగా మంత్రి శ్రీధర్‌బాబు, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌తో పాటు ఏఐసీసీ సల్మాన్ ఖుర్షీద్, శ్యామ్ పిట్రోడా, శశిథ రూర్, ప్రణీతి షిండే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్ణాటక సంగీత విభావరి, భారతీయ హస్తకళల ప్రదర్శన నిర్వహించారు.
సదస్సు రెండో రోజూ శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ‘నావిగేటింగ్ ది న్యూ వరల్ ఆర్డర్- వ్యూ ఫ్రమ్ ఇండియా’ అంశంపై జరిగే ప్లీనరీ సెషన్లో ఎంపీ ప్రియాంక గాంధీ, సల్మాన్ ఖుర్షీద్ ప్రసంగిస్తారు. ఉదయం 11.30 గంటలకు కాంగ్రెస్ పార్టీ 140 ఏళ్ల ప్రస్థానం, సమా చార హక్కు, ఉపాధి హామీ చట్టాలపై ప్రత్యేక ఎక్స్పో ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం జరి గే అంతర్జాతీయ సెషన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ క్యాపిటలిజం, వాతావరణ మార్పులు, బహుళపక్ష సంస్థల సంస్కరణలు, లింగ సమానత్వంపై చర్చలు ఉంటాయి. ఇందు లో ప్రముఖ ఆర్థికవేత్త థామస్ పికెట్టి (ఆన్లైన్), జయతి ఘోష్, నెదర్లాండ్స్ మాజీ మంత్రి బెర్ట్ కోయెండర్స్, రేణుకా చౌదరి తదితరులు పాల్గొంటారు.
తెలంగాణ రైజింగ్ సెషన్లో..
మరోవైపు, హైటెక్స్ వేదికగా జరిగే ‘తెలంగాణ రైజింగ్’ సెషన్లలో ఫ్యూచర్ సిటీ, ఆర్థి కటీసామాజిక న్యాయం, సంక్షేమ పథకాలపై మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీత క్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వివేక్ వెంకటస్వామి, జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ కంచె ఐలయ్య తదితరులు చర్చిస్తారు. సాయంత్రం 4 గంటలకు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందు కు ఆసక్తి ఉన్న పారిశ్రామికవేత్తలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
రేపు రాహుల్ గాంధీ, ఖర్గే ప్రసంగం..
చివరిరోజైన శనివారం ఉదయం సమాఖ్య వ్యవస్థ, తెలంగాణ సంస్కృతి, ఎన్నికల సమగ్రత, మీడియా భవిష్యత్, ప్రపంచశాంతి వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. వీటిలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరామ్, వినేశ్ ఫోగట్, సచి న్ పైలట్, మనీష్ తివారీ, జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ తదితరులు పాల్గొంటారు. మధ్యాహ్నం 3గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ‘డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్’ పేరుతో ముగింపు సభ జరుగుతుంది.
ఇందులో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వాగతోపన్యా సం చేయనుండగా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ కీలకోపన్యాసం చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రపంచ ప్రగతిశీల శక్తుల కోసం ‘అవర్ వరల్డ్ ఇన్సిస్ట్యూట్ ’ను ప్రారంభించి, సమ్మిట్ తీర్మానాన్ని ఆమోదిస్తారు. 15న ప్రతినిధుల ద్వైపాక్షిక సమావేశాలు, తిరుగు ప్రయాణాలతో సదస్సు ముగుస్తుంది.
తెలంగాణ రైజింగ్‌పై ప్రత్యేక ప్యానెల్ డిస్కషన్స్
ప్రస్తుతం ప్రపంచం అనేక సమస్యలు, సవాళ్లను ఎదుర్కొంటోందని, వాటికి పరిష్కార మా ర్గాలను అన్వేషించేందుకు ‘భారత్ సమ్మిట్- ఒక వేదికగా నిలవనుందని ఐటీ, పరి శ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. వివిధ దేశాల ప్రతినిధులు, మేధావులు ఒకచోట చేరి వాటిపై చర్చించడం ప్రాధాన్యతను సంతరించుకోనున్నదన్నారు. భారత్ సమ్మిట్ - స్వాగత కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాబోయే తరాలకు ఎలాంటి ప్రపంచాన్ని నిర్మించాలి? అందుకోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే అంశాలపై విస్తృత చర్చ జరగాల్సిన అవసరముందని అన్నారు. మేధోపరమైన చర్చలకు, ఆలోచనలకు, అంతర్జాతీయ భాగస్వామ్యాలకు తెలంగాణ ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతుందన్నారు. ప్రజాస్వామ్యం, ఏఐ, ప్రపంచ ఆర్థిక వ్యవ స్థకు కొత్త రూపు, వాతావరణ మార్పులు, అంతర్జాతీయ సంస్థల సంస్కరణలు, ప్రపంచ శాంతి, మీడియా భవిష్యత్తు తదితర అంశాలపై 12 అంతర్జాతీయ ప్యానెల్ డిస్కషన్స్ ఉంటాయన్నారు.
వీటితో పాటు హైటెక్స్ లో ‘తెలంగాణ రైజింగ్’ పేరిట 8 ప్రత్యేక చర్చా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. వీటిలో తెలంగాణ డెవలెప్ మెంట్ మోడల్, రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికలపై ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకుంటార న్నారు. ‘ఇండియా అండ్ ది వరల్డ్’ పేరుతో ప్రత్యేక ఎగ్జిబిషన్ కూడా జరగనుందన్నారు. హై దరాబాద్ ఎప్పటినుంచో విభిన్న సంస్కృతులు, సంప్రదాయాల కలయికకు వేదికగా నిలుస్తోందన్నారు. రాబోయే రెండు రోజులు ప్రపంచ దేశాల ఆలోచనలు, అభిప్రాయాల కలయికకూ వేదిక కానుందన్నారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు నిర్వహించనున్న సమ్మిట్ 2.0’లో పాల్గొనాలని విదేశీ ప్రతినిధులను ఆహ్వానించారు.