గూగుల్ చేసిన పని చూస్తే మైండ్ బ్లాంక్! వీడియో వైరల్!
గూగుల్ ఆఫీస్‌లో అసలు ఏం జరుగుతోంది? వైరల్ వీడియో వెనుక ఇదే కథ!
బెంగళూరు: టెక్ దిగ్గజం గూగుల్ 28వ వార్షికోత్సవం(Google 28th birthday) సందర్భంగా బెంగళూరులోని సంస్థ కార్యాలయంలో(Google Bengaluru office) సందడి నెలకొంది. సాధారణ కార్పొరేట్ ఈవెంట్లకు భిన్నంగా గూగుల్ థీమ్‌తో ఆఫీస్‌ను రంగురంగులుగా అలంకరించి ఉద్యోగులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.
పేపర్ రోసెట్స్, హార్ట్ షేప్ అలంకరణలు, కలర్‌ఫుల్ స్ట్రీమర్లతో ఆఫీస్‌ను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. గూగుల్(Google office celebration) ఉత్పత్తుల చిహ్నాలతో రూపొందించిన భారీ కేక్ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే కేక్ కంటే ఎక్కువగా అక్కడ ఏర్పాటు చేసిన ఫుడ్ మెనూ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. గూగుల్ లోగోతో అలంకరించిన కప్‌కేక్‌లు, బ్రాండెడ్ కుకీస్, కేక్ పాప్స్, చాక్లెట్ ఎక్లేర్స్, ధోక్లా, వీగన్ కాటన్ క్యాండీ వంటి రకరకాల తీపి, కారపు పదార్థాలను ఉద్యోగుల కోసం సిద్ధం చేశారు.
ఈ వేడుకలకు సంబంధించిన వీడియోను గూగుల్ టెక్ ఉద్యోగి గజల్ అరోరా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వీడియోలో(Google viral video) ఆఫీస్ డెకరేషన్ నుంచి ఫుడ్ కౌంటర్ వరకు ప్రతి అంశాన్ని చూపించారు. దీంతో సోషల్ మీడియాలో ఈ సెలబ్రేషన్స్‌పై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు.
“బర్త్‌డే వేడుకను ఎలా చేయాలో గూగుల్‌కు(Google employees celebration) బాగా తెలుసు”, “కార్పొరేట్ సెలబ్రేషన్స్ అంటే ఇవే” అంటూ పలువురు కామెంట్లు చేశారు. అలంకరణల్లో కనిపించిన చిన్నచిన్న వివరాలను కూడా కొందరు ప్రత్యేకంగా ప్రశంసించారు. 1998 సెప్టెంబర్‌లో లారీ పేజ్, సెర్గే బ్రిన్ కలిసి గూగుల్‌ను ప్రారంభించారు. సెర్చ్ ఇంజిన్‌గా మొదలైన సంస్థ ప్రస్తుతం అడ్వర్టైజింగ్, క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కన్స్యూమర్ టెక్నాలజీ తదితర రంగాల్లో విస్తరించింది.