పఠనాసక్తికి రీడతాన్ దోహదం

22-09-2026 | 06:57pm

ఆసిఫాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): విద్యార్థుల్లో పఠనాసక్తి, భాషా నైపుణ్యాలను పెంపొందించేందుకు రీడతాన్ కార్యక్రమం దోహదపడుతుందని కలెక్టర్ కె. హరిత(Collector K. Haritha) అన్నారు.మంగళవారం తెలంగాణ మోడల్ స్కూల్‌లో(Telangana Model School) జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి KB రీడతాన్ పోటీల్లో ఆమె పాల్గొన్నారు. చిన్ననాటి నుంచే పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు.

పోటీల్లో ప్రథమ బహుమతి తుమ్మిడి వశిష్ట (దహెగాం), ద్వితీయ బహుమతి యు. ఐశ్వర్య (గొల్లగూడ), తృతీయ బహుమతి రౌతు సాన్వి (చిన్నరాస్పల్లి) సాధించారు. విజేతలకు కలెక్టర్ బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యువరాజు మర్మాట్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కామ్టే అనిల్ కుమార్, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు