దేవాలయ అభివృద్ధికి 12.41 లక్షలు..
హైదరాబాద్ బడంగ్ పేట్ కు చెందిన ఆశయం నరసింహారెడ్డి సోదరులు..
యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 22 (విజయకాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం(Sri Lakshmi Narasimha Swamy Devasthanam) భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా దాతలు ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా హైదరాబాద్ బడంగ్‌పేట్ కు చెందిన ఆశయం గారి నరసింహారెడ్డి, కృష్ణారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ముగ్గురు సోదరులు రూ.12.41 లక్షల విలువైన అభివృద్ధి పనులను తమ స్వచ్ఛంద విరాళంను దేవస్థానం కార్యనిర్వాహణాధికారి భవాని శంకర్ కు అందజేశారు.
కొండకింద దేవస్థానానికి సమీపంలో భక్తుల సౌకర్యార్థం సుమారు రూ.9.00 లక్షల వ్యయంతో రెండవ కళ్యాణకట్ట ఏర్పాటు, విష్ణు పుష్కరిణిని కోతుల బెడద నుంచి రక్షించేందుకు రూ.3.41 లక్షల వ్యయంతో సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడానికి విరాళం అందజేసినట్లు తెలిపారు.దేవస్థాన అభివృద్ధి, దేవస్థానం కు విరాళం ఇచ్చేందుకు వచ్చిన ముగ్గురు సోదరులను దేవస్థానం కార్యనిర్వహణాధికారి జె. భవాని శంకర్ ధన్యవాదాలు తెలిపారు.