సరిహద్దు సర్వేను పరిశీలించిన అధికారులు

29-09-2026 | 10:17pm

పెంచికల్‌పేట్( విజయక్రాంతి ): మండలంలోని బొంబాయిగూడ–గుంట్లపేట గ్రామాల మధ్య కొనసాగుతున్న సరిహద్దు సర్వేను జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్(District Additional Collector David) పరిశీలించారు. కాగజ్‌నగర్ సబ్‌కలెక్టర్ చౌదరి హర్ష, తహసీల్దార్ రవీందర్, ఆర్‌ఐ రాజేశ్వర్, జీపీఆర్వో శారూక్‌లతో కలిసి సర్వే ప్రక్రియను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సరిహద్దుల గుర్తింపునకు ఇరు గ్రామాల రైతులు అధికారులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దుర్గం పోశన్న, సర్వేయర్ ధన్‌రాజ్ రెవెన్యూ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు