తాగునీటి సరఫరా పునరుద్ధరణ

29-09-2026 | 10:39pm

ఘట్ కేసర్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): పోచారం డివిజన్ చౌదరిగుడ ప్రాంతంలో 10 కాలనీలకు నిలిచిపోయిన తాగునీటి సరఫరాను కేవలం 24 గంటల్లో పునరుద్ధరించడంలో ఘట్కేసర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కేశపాల వినోద్ కుమార్(Keshapala Vinod Kumar) చొరవ చూపించారు. 10 కాలనీలకు తాగునీరు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం వినోద్ దృష్టికి రావడంతో ఆయన వెంటనే స్పందించారు. సమస్యను స్వయంగా పరిశీలించి, సంబంధిత హెచ్‌ఎండబ్ల్యుఎస్ అధికారులతో మాట్లాడి అత్యవసరంగా చర్యలు చేపట్టాలని కోరారు.

అధికారులతో సమన్వయం చేసుకుని పైప్‌లైన్‌లో ఏర్పడిన సమస్యను గుర్తించి, అవసరమైన పైప్‌లైన్ జాయింట్ పనులను వెంటనే పూర్తి చేయించారు. దీంతో నిలిచిపోయిన తాగునీటి సరఫరా తిరిగి ప్రారంభమై పది కాలనీల ప్రజలకు ఉపశమనం లభించింది.

“నిన్న సమస్యను తెలుసుకున్నాం.. నేడు పరిష్కారం చూపించాం” అనే విధంగా ప్రజల సమస్యలపై వెంటనే స్పందిస్తూ అధికారులతో సమన్వయం చేసుకుని పరిష్కారం చూపించిన  ప్రజా ప్రభుత్వం ప్రజా పాలనలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల విషయంలో ఎలాంటి ఆలస్యం లేకుండా స్పందించి, సమస్య పరిష్కారం అయ్యే వరకు అధికారులతో సమన్వయం చేసుకుంటామని వినోద్ తెలిపారు.

మరిన్ని వార్తలు