చదువే తొలి మెట్టు
29-09-2026 | 10:29pm
నేరడిగొండ, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): అన్ని రకాల అభివృద్ధికి చదువే తొలిమెట్టు అని ఎమ్మెల్యే అనిల్ జాదవ్(MLA Anil Jadhav) పేర్కొన్నారు. మంగళవారం బుగ్గారం ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి విచ్చేసిన ఆయనకు విద్యార్థులు నృత్యాలు చేస్తూ స్వాగతం పలికారు. సాంకేతికతను వినియోగించుకుంటూ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రణాళికతో చదివి నెరవేర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణ, నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.