నీటి భద్రతకు ఫారం పాండ్లు!

09-10-2026 | 04:35pm

పనుల పరిశీలన..

పెన్షన్‌ దరఖాస్తుల తనిఖీ..

సామూహిక మరుగుదొడ్లకు భూమిపూజ

వాంకిడి, (విజయక్రాంతి): వర్షాభావ పరిస్థితులను(Rainy weather conditions) ఎదుర్కొనేందుకు వర్షపు నీటిని(Rainwater) ఒడిసిపట్టి, వ్యవసాయానికి వినియోగించేలా ఫారం పాండ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బానోత్ దత్తారాం(Banoth Dattaram) సూచించారు. శుక్రవారం మండలంలోని గొయెగావ్ గ్రామ పంచాయతీలో(Goyegaon Gram Panchayat) నిర్మిస్తున్న వ్యవసాయ కుంటల పనులను పరిశీలించి కూలీలకు పలు సూచనలు చేశారు. నీటి సంరక్షణతో(Water Conservation) పంటల దిగుబడిని పెంచుకోవడంతో పాటు, ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు పనులు కల్పించవచ్చన్నారు. జాబ్ కార్డుదారులు(Job card holders) VB-G RAM G పథకం(VB-G RAM G Scheme) కింద కల్పిస్తున్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అనంతరం వాంకిడి గ్రామ పంచాయతీలో పెన్షన్ల కోసం దరఖాస్తు(Pension applications) చేసుకున్న వారి అర్హతలను పరిశీలించారు. మండల పరిషత్ కార్యాలయానికి వచ్చే ప్రజల సౌకర్యార్థం రూ.3 లక్షలతో నిర్మించనున్న సామూహిక మరుగుదొడ్లకు సర్పంచ్ సతీష్, ఉపసర్పంచ్ దీపక్ ముండేలతో కలిసి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో పాటిల్ జ్యోత్స్న, ఇంజనీరింగ్ అధికారి మోసిన్ బిన్ అహ్మద్, సాంకేతిక సహాయకులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు