కల్వర్టు నిర్మాణ పనుల నాణ్యతపై విచారణ జరపాలి
04-11-2026 | 12:13pm
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలం(Asifabad Mandal)లోని కొమ్ము గూడ ఎస్సీ కాలనీ సమీపంలో చేపట్టిన కల్వర్టు నిర్మాణ పనుల్లో(Culvert Work) నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి (ఎస్సీ సెల్) ఇగరపు సంతోష్ ఆరోపించారు.
వర్షాలు వస్తున్నాయనే కారణంతో హడావుడిగా పనులు పూర్తి చేశారని, కల్వర్టు కింద ఫ్లోరింగ్ పటిష్టంగా లేకపోవడంతో నీరు నిలిచి మట్టి పేరుకుపోతోందని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, పనుల నాణ్యతను సాంకేతికంగా పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.