26న విద్యాసంస్థలకు సెలవు: కలెక్టర్ కె.హరిత
24-10-2026 | 08:16pm
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): కుమురం భీం 86వ వర్ధంతి(Kumuram Bheem 86th Death Anniversary)ని పురస్కరించుకుని ఈ నెల 26న జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు స్థానిక సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ కె.హరిత(Collector K. Haritha) శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాలలకు ఈ సెలవు వర్తించదని స్పష్టం చేశారు. ఈ నెల 26న ప్రకటించిన సెలవుకు బదులుగా నవంబర్ 14వ తేదీ రెండో శనివారం అన్ని పాఠశాలలు పని చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ವಿದ್ಯಾರ್ಥులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థల యాజమాన్యాలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.