5న శ్రీ వెంకటేశ్వర స్వామి సంత బహిరంగ వేలం..
25-10-2026 | 03:47pm
సింగరేణి (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా(Khammam District) సింగరేణి మండల కేంద్రంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన సంత వేలం నవంబర్ నెల 5వ తేదీన నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో కొండకింది వేణుగోపాలాచార్యులు ఓ ప్రకటనలో తెలిపారు. వేలంలో పాల్గొనే వారు ప్రాథమిక ధరావతు సొమ్ముగా రూ.50 వేల డీడీను నవంబర్ 3వ తేదీ లోపు సమర్పించాల్సి ఉంటుంది. సంత నిర్వహణ కాలపరిమితి ఒక సంవత్సరం కాగా, దేవస్థాన నిబంధనలకు లోబడి నిర్వహణ చేపట్టాల్సి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి గల వారు వేలంలో పాల్గొనాలని సూచించారు.