కల్లూరుగూడ గ్రామంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ (DTR) ప్రారంభించిన ఎమ్మెల్యే
25-10-2026 | 04:43pm
ఉట్నూర్, అక్టోబర్ 25 ( విజయక్రాంతి ): ఉట్నూర్ మండలం(Utnoor Mandal) కల్లూరుగూడ గ్రామంలో నూతన విద్యుత్ పంపిణీ ట్రాన్స్ఫార్మర్(Electricity distribution transformer) (DTR)ను ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్(MLA Vedma Bojju Patel) ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో విద్యుత్ సరఫరాకు సంబంధించి ప్రజలకు, రైతులకు ఉపయోగపడేలా ట్రాన్స్ఫార్మర్ అందుబాటులోకి వచ్చింది. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు,స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.