విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసుల పంపిణీ
కల్లూరు,(విజయ క్రాంతి): విద్యార్థుల(students) సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కల్లూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల(government high schools)లో సోమవారం ప్లేట్లు, గ్లాసులను పంపిణీ చేశారు. ఆర్యవైశ్య మహాసభ ఖమ్మం జిల్లా(Khammam District) అధ్యక్షుడు పసుమర్తి చందర్రావు, కాంగ్రెస్ నాయకుడు దోసపాటి శ్రీనివాసరావు మనుమడు పద్మ విహాన్ జన్మదిన వేడుకల సందర్భంగా ఈ వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పద్మ విహాన్ తల్లిదండ్రులు పసుమర్తి సందీప్, మానస దంపతులు అమెరికాలో ఉంటూ విద్యార్థులకు ప్లేట్లు,గ్లాసులు అందించే విధంగా కృషి చేశారు.
మున్సిపల్ చైర్మన్ ధరావత్ మోహన్ నాయక్ చేతుల మీదుగా విద్యార్థులకు వాటిని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థుల తల్లిదండ్రులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్కే ఉస్మాన్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శీలం కోటేశ్వరి, కృష్ణారెడ్డి, వార్డు కౌన్సిలర్లు యాస శ్రీకాంత్, ఉబ్బన రాంబాబు, సుధారాణి, ఆర్యవైశ్య ప్రముఖులు దారా రంగ, దోసపాటి కృష్ణార్జునరావు, గౌరవరపు కిషోర్, నాకబండి శ్రీను, చలువాది నగేష్, అనుముల శ్రీను తదితరులు పాల్గొన్నారు.