స్పెషల్ టీచర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
ముదిగొండ విజయ క్రాంతి అక్టోబర్ 4 : ముదిగొండ పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(Mudigonda PM Sri Zilla Parishad High School) లో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు బోధించడానికి అర్హత కలిగిన స్పెషల్ టీచర్ల(Special teachers) నుండి దరఖాస్తులు(applications) ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల హెచ్ఎం కే శాంతి(School Headmaster K. Shanthi) ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తాత్కాలిక నియమకంపై(Temporary appointment) నవంబర్ 2026 నుంచి మార్చి 2027 వరకు పనిచేయడానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. స్పెషల్ టీచర్ ట్రైనింగ్(Special Teacher Training) కు సంబంధించి ధ్రుపత్రాలతో ఈనెల 8వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.