సామాన్య కార్యకర్త కు దక్కిన అరుదైన గొప్ప గౌరవం
01-10-2026 | 05:04pm
శ్రీ లక్ష్మినరసింహాస్వామి గుడి చైర్మన్ గా ఎస్సి సామాజిక వర్గానికి చెందిన కొమ్ము నరసింహారావు
ముదిగొండ, విజయక్రాంతి. అక్టోబర్ 1: మండల కేంద్రమైన ముదిగొండ లో కాంగ్రెస్ సామాన్య కార్యకర్త కు అరుదైన గౌరవం దక్కిందంటే ఇదే నిదర్శనం. ముదిగొండలో ని శ్రీ లక్ష్మినరసింహస్వామి లో ఎస్సి సామాజానికి చెందిన కొమ్ము నరసింహారావు ను(Kommu Narasimha Rao) నియమిస్తూ గురువారం దేవాదాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేసారు. పుట్టిన దగ్గర నుండి కాంగ్రెస్ పార్టీ లో తిరుగుతూ కాంగ్రెస్ జెండా ని భుజాల పై మోస్తూ పార్టీ లో కొనసాగుతున్నటువంటి నరసింహారావు కి ఈ గౌరవం దక్కడం కార్యకర్తలు ప్రజలు హర్షం వ్యక్తం చేసారు.