కాఫెడ్ సంస్థ చొరవతో కృత్రిమ కాలు అందజేత
వెంకటాపురం, నూగూరు అక్టోబర్ 3 (విజయక్రాంతి) : మండలం పరిధిలో ఇప్పగూడెం గ్రామానికి(Ippagudem village) చెందిన బొబ్బుల కృష్ణ(Bobula Krishna) అనే వికలాంగుడికి కాఫెడ్ సంస్థ(KAFED Organization) చొరవతో, వైరా ఎస్ఐ పి. రామారావు(SI P. Ramarao) దాత శ్రీనివాసరావు సహకారంతో కృత్రిమ కాలు(Artificial leg) అమర్చారు. కృష్ణకు ముగ్గురు పిల్లలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. పిల్లల చదువు, కుటుంబ పోషణ, రోజువారీ అవసరాలను తీర్చుకోవడం గత రెండు సంవత్సరాలుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
శారీరక ఇబ్బందులతో పాటు, కుటుంబాన్ని తాను సరిగా ఆదుకోలేకపోతున్నాననే బాధతో కృష్ణ మానసికంగా ఎంతో ఆవేదనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న వెంటనే స్పందించి, కాఫేడ్ ప్రతినిధులు కృష్ణకు కృత్రిమ కాలు అందించేందుకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. రామారావు సహకారం, శ్రీనివాసరావు దాతృత్వంతో విజయవాడలోని సంబంధిత ఆసుపత్రిలో బొబ్బుల కృష్ణకు సుమారు 65 వేల రూపాయల విలువైన కృత్రిమ కాలును అమర్చారు.
కృత్రిమ కాలు అమర్చిన అనంతరం కృష్ణ మాట్లాడుతూ ప్రమాదం జరిగినప్పటి నుంచి తన కుటుంబం ఎదుర్కొంటున్న కష్టాలను గుర్తించి తనకు సహాయం చేసిన వైరా ఎస్ఐ పి. రామారావుకి, దాత శ్రీనివాసరావుకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాఫెడ్ యానిమేటర్ స్వరూప, పద్మ, కాఫెడ్ డైరెక్టర్ బ్రదర్ కె. లూర్దు రాజుకు కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.