పారుపల్లికి ఆర్టీసీ బస్సు.. ఏళ్ల కల సాకారం

28-09-2026 | 06:47pm

సర్పంచ్ చొప్పరి సంపత్ కృషితో నెరవేరిన ఏళ్ల కల

ముత్తారం, సెప్టెంబర్ 28 (విజయ క్రాంతి): మారుమూల గ్రామమైన పారుపల్లికి ఆర్టీసీ బస్సు(RTC bus) సౌకర్యం అందుబాటులోకి రావడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ ప్రజల రవాణా ఇబ్బందులను గుర్తించిన సర్పంచ్ చొప్పరి సంపత్ ఆర్టీసీ అధికారులను కలిసి పలుమార్లు విజ్ఞప్తి చేయడంతో బస్సు సేవలు గ్రామంలోకి ప్రవేశించాయి. జమ్మికుంట నుంచి గోదావరిఖని వెళ్లే ఆర్టీసీ బస్సును పారుపల్లి గ్రామం లోపలికి నడిపించేందుకు గోదావరిఖని డిపో అధికారులు సానుకూలంగా స్పందించారు. బస్సు గ్రామంలోకి చేరుకోవడంతో మహిళలు, వృద్ధులు, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే పెద్దపల్లి వైపు వెళ్లే బస్సును సైతం గ్రామం లోపలి నుంచి నడిపించేందుకు చర్యలు తీసుకుంటామని సర్పంచ్ తెలిపారు. 

ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. బస్సు సౌకర్యం కల్పించిన గోదావరిఖని డిపో అధికారులకు సర్పంచ్ చొప్పరి సంపత్, గ్రామస్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అంబటి చంద్రమౌళి, గ్రామ యువజన అధ్యక్షుడు కారుపాకుల శ్రీకాంత్, వీ.ఆర్. తెలుగు టీవీ రాజశేఖర్, బైరాం రాజు, మాజీ వైస్ ఎంపీపీ తిరుమలరావు, పీక శంకర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు