నీటి సరఫరాకు బ్రేక్

28-09-2026 | 06:27pm

గిర్మాపూర్ మున్సిపల్ పట్టణంలో నీటి సస్యలను పరీక్షించాలని వినతి

వెంటనే వాటర్ మెన్ ను నియమించాలి

మేడ్చల్ మున్సిపల్ పట్టణ బిజెపి మాజి అధ్యక్షులు కొండo ఆంజనేయులు ముదిరాజ్

మేడ్చల్ అర్బన్(విజయక్రాంతి): గిర్మాపూర్ మున్సిపల్ పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్య(Drinking Water Problem)ను తక్షణమే పరిష్కరించాలని మేడ్చల్ మున్సిపల్ పట్టణ బీజేపీ(BJP) మాజీ అధ్యక్షుడు కొండం ఆంజనేయులు ముదిరాజ్ కోరారు. ఈ మేరకు మేడ్చల్ సర్కిల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ సుధాంష్‌కు వినతిపత్రం అందజేశారు. గిర్మాపూర్ మున్సిపాలిటీ(Girmapur Municipality)కి వాటర్‌మెన్‌ను వెంటనే నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. గిర్మాపూర్ మున్సిపల్ వాటర్‌మెన్ శ్రీరాములు మృతి చెందిన అనంతరం తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడి, పట్టణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆంజనేయులు తెలిపారు.

ఈ నేపథ్యంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు డిప్యూటీ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందించినట్లు చెప్పారు. గిర్మాపూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తినే వాటర్‌మెన్‌గా నియమించాలని కోరినట్లు తెలిపారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారిని వాటర్‌మెన్‌గా నియమిస్తే గిర్మాపూర్‌లోని నీటి సరఫరా వ్యవస్థపై స్థానిక అవగాహన లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆంజనేయులు డిప్యూటీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా నాయకుడు బి. రాఘవ రెడ్డి, డివిజన్ కిసాన్ మోర్చా అధ్యక్షుడు చీర్ల సత్యనారాయణ, బీజేపీ కార్యదర్శి బండి విష్ణు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు