ప్రజావాణి అర్జీలు వారంలోగా పరిష్కరించాలి

28-09-2026 | 06:36pm

భూపాలపల్లి, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): ప్రజావాణిలో స్వీకరించిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(District Collector Rahul Sharma) అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ సమస్యలపై 81 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. అర్జీలను వారంలోగా పరిష్కరించి, చర్యల వివరాలను సంబంధిత పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓ హరికృష్ణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు