పేద కుటుంబానికి అండగా సర్పంచ్

28-09-2026 | 06:44pm

పేదవాడి అంత్యక్రియలకు ఆర్థిక సాయం

తాడ్వాయి,సెప్టెంబర్,28( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కాళోజివాడి గ్రామంలో సోమవారం పేదవాడి అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందించారు గ్రామ సర్పంచ్(Village Sarpanch) చంద్రారెడ్డి. పంచాయతీ ఎన్నికల(Panchayat elections) సందర్భంగా ఇచ్చిన హామీలో భాగంగా ఆయన ఈ ఆర్థిక సహాయాన్ని అందించారు.సర్పంచ్ గా గెలిచిన నాటి నుంచి గ్రామంలో మృతి చెందిన ప్రతి పేదవాడికి రూ. 5 వేలు అంత్యక్రియల కోసం ఆర్థిక సాయం అందిస్తున్నారు. గ్రామానికి చెందిన గడ్డం శివలింగం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన అంత్యక్రియల కోసం మృతుడి కుమారుడు గంగాధర్ కు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సాయికుమార్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు