జాతిపితకు ఘన నివాళులు
హుజురాబాద్, అక్టోబర్ 02:(విజయక్రాంతి): జాతిపిత మహాత్మా గాంధీ(Mahatma Gandhi's) 157వ జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ డివిజన్లో ఘనంగా నిర్వహించారు. జమ్మికుంట, వీణవంక, ఇల్లంతకుంట, కేశపట్నం, సైదాపూర్ తో పాటు హుజురాబాద్ పట్టణంలోని కేసి క్యాంప్, హైస్కూల్, కన్యాక పరమేశ్వరి టెంపుల్ ముందు గల గాంధీజీ విగ్రహానికి మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని, ఆర్యవైశ్యసంగం నాయకులుపూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గాంధీజీ దేశానికి అందించిన సేవలను, అహింసా మార్గంలో స్వాతంత్ర్య సాధనకు ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కిషన్, మున్సిపల్ వైస్ చైర్మన్ అంజలి, కౌన్సిలర్లు గందె శ్రీనివాస్, తాళ్లపల్లి రమేష్, మొగిలి, సొల్లు సునీత, కోయల్కర్ భారతి, సందమల్ల పుణ్య లత, కోఆప్షన్ సభ్యులు, ఆర్య వైశ్య సంఘం నాయకులు, మున్సిపల్ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు తోపాటు తదితరులు పాల్గొన్నారు.