గణపురం గీత సొసైటీలో నూతన సభ్యత్వాలు ఇవ్వాలి

02-10-2026 | 03:47pm

ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టిన గౌడ యువకులు 

గణపురం, అక్టోబర్ 02, (విజయ క్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అతిపెద్ద గౌడ సొసైటీ అయిన గణపురం గీత సహకార సంఘంలో( Ganapuram Geetha Cooperative Society) తమకు నూతన సభ్యత్వాలకు అవకాశం కల్పించాలని గౌడ యువకులు శుక్రవారం ప్రధాని రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. గత రెండు రోజులుగా సొసైటీ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుండగా గౌడ యువకులు సమావేశం లో తమకు సంఘంలో సభ్యత్వాలు ఇవ్వాలని పెద్ద మనుషుల దృష్టికి తీసుకెళ్లారు.

సభ్యత్వాల విషయమై పెద్ద మనుషుల నుండి సానుకూల స్పందన రాకపోవడంతో సమావేశ స్థలం నుండి నేరుగా ప్రధాన రహదారి వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. తమకు వారసత్వ సభ్యత్వాలు ఇవ్వాలని గౌడ యువకులు అందరికీ సొసైటీలో అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా  డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సుమారు వందమందికి పైగా గౌడ యువకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు