ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
02-10-2026 | 04:14pm
గాంధీ చిత్రపటానికి నాయకుల నివాళులు
భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 02 ( విజయక్రాంతి ) : జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలు భూపాలపల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో(BRS Party Office) మాజీ పట్టణ అధ్యక్షులు కటకం జనార్దన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సెగ్గం సిద్ధు, మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు మాదాసు తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు.